అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో వీధి కుక్కలను ఎటువంటి ఉత్తర్వులు లేకుండా హతమారుస్తున్నారని సుండ్రు పుట్టు ప్రాంతానికి చెందిన మోరి రవి అనే యువకుడు ఆరోపించారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పాడేరు పట్టణంలో అధికారులు ధిక్కరించి వీధి కుక్కలను హతమారుస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశానని త్వరలో దీనిపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతానంటూ ఆయన వెల్లడించారు.