ముగిసిన టాలీ సర్టిఫికెట్ కోర్స్., సర్టిఫికెట్స్ అందజేత ప్రొఫెసర్ హుస్సేన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం మరియు ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బీ.కాం విద్యార్థుల కొరకు నిర్వహించిన టాలీ సర్టిఫికెట్ కోర్స్ ముగింపును పురస్కరించుకొని గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే హుస్సేన్ గారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ మహేశ్వర గుప్తా గారు మాట్లాడుతూ కోర్సు ను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.