వినాయక చవితి పండుగ ఉత్సాహం మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి.రాయచోటిలో గత మూడు వారాలుగా కిలో రూ.200కి లభించిన బ్రాయిలర్ చికెన్, ఆదివారం రూ.220కి చేరింది. స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.250కి దూసుకెళ్లింది.నాటుకోడి చికెన్ ధరలు అయితే మరింతగా కిలో రూ.500 నుంచి రూ.600 పలుకుతున్నాయి. ఇక మటన్ కిలో రూ.800-900 ఉండగా, చేపలు రకాన్ని బట్టి రూ.150-200 మధ్య విక్రయమవుతున్నాయి.