తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేస్తున్న పలు అభివృద్ధి పనులను పల్లెల్లో పనుల జాతర 2025గా కార్యక్రమాలు గ్రామాలలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండల కేంద్రంలోని అదేవిధంగా దాదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువుల పాకలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు అందుకే రైతులు ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని తెలిపారు.