అయిజ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం నందు యూరియా బస్తాల కోసం మహిళ రైతులు కిలోమీటర్ల మేర క్యూ లైన్ పాటిస్తున్నారు. ఒక్కరోజు సెలవు దినం రావడంతో ఉదయాన్నే సింగిల్ విండో కార్యాలయానికి చేరుకొని బారులు తీరారు. తక్షణమే మున్సిపాలిటీ కేంద్రంలో యూరియా కొరతను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.