శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణానికి నీటిని సరఫరా చేసి దొరిగల్లు పంప్ హౌస్ వద్ద మోటార్లు మరమ్మతుకు గురి కావడంతో కదిరి పట్టణానికి నీటి సరఫరా లో కొద్ది రోజుల క్రితం ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ చొరవ తీసుకొని ఆరున్నర లక్షల రూపాయలతో నూతన మోటర్ ను ఏర్పాటు చేసి ఇతర మోటార్లను మరమ్మత్తు చేయించారు. శుక్రవారం సిద్ధం కావడంతో పట్టణానికి అంతరాయం లేకుండా నీటి సరఫరా చేస్తామని చైర్పర్సన్ దిల్షాద్ ఉనిసా తెలియజేశారు.