శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం గూనిపల్లిలో గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రాథమిక సంఘం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతూ యూరియా స్టాక్ ఎంత ఉంది? రైతులకు ఎంత ఇస్తున్నారు? అని ఆరా తీశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. నీరు సమృద్ధిగా ఉంటే వరి పంట పెట్టాలని, లేకుంటే తడి పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు.