సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ పదవి విరమణ సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి హాజరై ఉపాధ్యాయుడిగా మండల స్థాయి పిఆర్టియు నాయకుడిగా పనిచేసి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్ ఎదగడం అభినందనీయమని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తించారు. పిఆర్టియు సంఘం నాయకులు పాల్గొన్నారు.