నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం లో వీడని వర్షం రైతన్నలకు నష్టంఇప్పుడిప్పుడే అధికవర్షాలనుంచితెరుకుంటున్న వరి, మొక్కజొన్న పొలాలు మళ్లీవర్షపునీటితోనిండిపోయాయి. మొక్కజొన్న పంటలు నీరు నిల్వ ఉండడంతో జోము పోయి కంకి ఎదుగుదలో ఎటువంటి మార్పులేక చనిపోతున్నాయి.దీనికి తోడుగా శివబాష్యం సాగర్ ప్రాజెక్ట్కు వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో మూడుగేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో గువ్వలకుంట్ల వరిపొలాలు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. వరిపొలాలు నీటి నిండి చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని గ్రామాలలో కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.