నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని తేల కంటి గూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఈ గ్రామంలో మొత్తం 107 ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నారు ఇందులో ఇప్పటివరకు సగానికి పైగానే నిర్మాణాలు పూర్తి అయి ప్రారంభ దశకు వచ్చాయి. మిగతా నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయి .ఈ సందర్భంగా లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుంటే సకాలంలో ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.