భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ గొల్లల తాళ్లవలస గ్రామానికి చెందిన యువకుడు అదృష్యంపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసారు. గొలగాని. పాపయ్య చిన్న కుమారుడు గొలగాని.వివేక్ (20) మేకల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటాడు. మేకలు కొరకు వెళ్లి వస్తానని వెళ్లిన యువకుని ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుపై సిఐ.బి.తిరుమల రావు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.