పామర్రులో మంగళవారం విషాదం నెలకొంది. తండ్రి తన ఇద్దరు పిల్లలను బైక్పై స్కూల్కు తీసుకెళ్తుండగా, కురుమద్దాలి జాతీయ రహదారిపై లారీ రివర్స్ చేయడంతో బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి కలపాల జోయల్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. సోదరుడు అభి, తండ్రికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.