పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు రూ.6వేల 400 కోట్లు నిధులు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగంలో నెలకొని సమస్యలు పరిష్కారానికి ఈ నెల 6వ తేదీ ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు సాయి ఉదయ్, రంగప్ప పేర్కొన్నారు. గురువారం కర్నూలు నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ముందుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. జీవో నెంబర్ 77ను రద్దుచేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస