రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ABVP నాయకులు నిర్వహించిన ధర్నా తీవ్ర ఉధృతంగా మారింది. జిల్లా కలెక్టరేట్ లోకి విద్యార్థి సంఘ నాయకులు చొచ్చుక వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసే సమయంలో విద్యార్థులకు పోలీసులకు తోపులాట చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత నడుమ ABVP నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యా సమస్యలపై పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చే విద్యార్థుల ను అణచివేశ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.