భారతదేశ సరుకులపై అమెరికా సుంకాలు విధించటాన్ని తప్పుపడుతూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. అమెరికా భారత దేశ సరుకులపై సుంకాల విధించడం వలన కొన్ని పరిశ్రమలు భారతదేశంలో పూర్తిస్థాయిలో దెబ్బతినే ప్రమాదం ఉందని వారు తెలిపారు ప్రధానంగా ఆక్వారంగం వస్త్ర పరిశ్రమ పూర్తిస్థాయిలో దెబ్బతింటున్నాయని తెలిపారు మరోవైపు ఇతర దేశాలతో స్నేహబంధాన్ని కొనసాగించటానికి కూడా అమెరికా తప్పుపడుతుందని అమెరికా ఆధిపత్యం ధోరణిని తప్పుపడుతూ వామపక్షాల నేతలు మాట్లాడారు. భారతదేశ వాణిజ్యాన్ని దెబ్బ కొట్టేందుకు అమెరికా కుట్ర పన్నుతుందన్నారు