కార్మికుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడంలేదని సీఐటీయూ కాంట్రాక్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మానిక్ విమర్శించారు. పాశమైలారంలోని సువెన్ పరిశ్రమ ముందు శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని చెప్పారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.