సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేయడం దారుణం : సీపీఐ ఏర్పేడు మండలం వికృతమాల సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై సీఎస్ఓ దాడి చేయడాన్ని సీపీఐ నేతలు ఖండించారు. ప్రకాశం జిల్లా వాసి భాగ్య నాయక్ సెక్యూరిటీగా గత 6 నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనను సీఎస్ఓ ఆఫీస్కి పిలిపించి దాడి చేసి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. గాయపడిన భాగ్య నాయకు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో సీపీఐ నాయకులు పరామర్శించారు.