డిమాండ్ల సాధనలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు గురువారం సాయంత్రం గజపతినగరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మెంటాడ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం ప్రదర్శన జరిపి పలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి లక్ష్మి, గజపతినగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు సుభాషిణి, జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.