పి.గన్నవరం మండలం చాకలిపాలెం ఏటిగట్టు దిగువన ఉన్న కనకాయలంక కాజ్వే శుక్రవారం ముంపునకు గురైంది. గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద క్రమేపి పెరుగుతోంది. దీంతో కనకాయలంక కాజ్వేపై రెండున్నర అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పడవలపై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది.