రాయచోటి పట్టణం కొత్తపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాస్ అహమ్మద్ భౌతిక కాయాన్ని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. గురువారం కడప నగరంలోని కాగితాలపెంటలోని వారి నివాసంలో ఉంచిన ఉపాధ్యాయుడి బౌతిక కాయాన్ని శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన ఎజాస్ అహమ్మద్ మృతి సంఘటన దురదృష్టకరం, విచారకరమని ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అతని మృతి పట్ల సంతాపం తెలిపి,వారి కుటుంభ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.వారి కుటుంబానికి అండగా వుంటామన్నారు.