ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందలూరు గ్రామానికి చెందిన కుంచాల నాగార్జున అనే వ్యక్తికి ఒంగోలు ఎక్సైజ్ కోర్టు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పించింది. మొలకలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ వద్ద 2 సం.. క్రితం వ్యక్తిగత అవసరాల కోసం రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించే క్రమంలో నాగార్జున లక్ష్మీనారాయణకు చెల్లని చెక్కు ఇచ్చాడు. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో ఒంగోలు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి కోమలవల్లి నిందితుడికి జరిమానా జైలు శిక్ష విధించారు.