వినాయక నిమజ్జనం సందర్భంగా బి.కొత్తూరులో దళితులపై జరిగిన దాడిని మానవ హక్కుల వేదిక ఖండించింది. గాయపడిన బాధితుడు ఎం. అంజిబాబును శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో అంజి బాబును మానవ హక్కుల వేదిక సభ్యులు పరామర్శించారు .డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే దళితులపై దాడులు జరగడం దురదృష్టకరమని వేదిక సభ్యుడు రాజేశ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.