శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 200 మంది భక్తులు బాగేపల్లి సమీపంలోని గడిదంకు పాదయాత్రగా వెళ్లారు. స్థానిక ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించి ఈ ఒక్క రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.