శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగి గ్రామంలో దుర్గా వైన్స్ షాపు సమీపంలో ఉన్న ఒక ఇంట్లో బుధవారం అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ముందస్తు సమాచారంతో ప్రొహిబిషన్ ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 205బాటిళ్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాతపట్నం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి వివరాలు మీడియాకు తెలియజేశారు. నలుగురు నిందితుల్లో ఇద్దరని పట్టుకున్నామని, టుమారో ఇద్దరూ నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.