నాటుసారాయి తయారు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని 16.75లీటర్ల నాటుసారాయిని స్వాదీనం చేసుకొన్నట్లు ఎక్సైజ్ డిస్ట్రిక్ టాస్క్‌ఫోర్స్ టీం ఎస్‌ఐలు హనుమంతు, అనుదీప్‌లు తెలిపారు. ఎక్సైజ్ డీసీ హరికిషన్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా శేరి తండాలో కేతావత్ హిరామన్ తన ఇంట్లో అక్రమంగా నాటుసారాయి తయారు చేస్తున్నాడని అన్నారు. నాటుసారాయ బట్టీని ధ్వసం చేసి సారాయి స్వాదీనం చేసుకొని నిందితుణ్ణి అదుపులోకి తీసుకొన్నట్లు చెప్పారు. దాడుల్లో సిబ్బంది అంజిరెడ్డి, అరుణ్‌జ్యోతి, రాజేష్ ఉన్నారు.