కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారులు, బీసీల పేరుతో కేటాయించిన 47 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు చేయాలని చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాస్కరయ్య తెలిపారు. కడప జిల్లా బద్వేల్ లోని పెన్సనర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు జరపాలని డిమాండ్ చేశారు. గడచిన 14 నెలల కాలంలో వృత్తిదారులు, బీసీలకు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరపలేదని అన్నారు. 56 కార్పొరేషన్ లో చైర్మన్లు 729 మంది డైరెక్టర్లు కి గౌరవ వేతనాలు పేరుతో జీతాలు ఇచ్చి గత ప్రభుత్వం చెప్పిన విధంగా మీటింగులు మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.