శనివారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం బాయి మల్లేష్ తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కలుగజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నరసింహ కుటుంబ సభ్యులను ఎండి యూసుఫ్ మరియు బాలకిష్టమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని భరోసాను కలుగజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.