ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లో రేషన్ కార్డు లేని వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మార్వో కిషోర్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వ నూతన రేషన్ కార్డు కోసం ఆరు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. మార్పుల చేర్పులకు గాని కార్డు విభజన గాని చిరునామాల మార్పుకు గాని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సేవలను దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం నుంచి పొందవచ్చన్నారు. వారం తర్వాత వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.