కుందుర్పి మండలం ఎన్. వెంకటాంపల్లి గ్రామంలో హనుమంతప్ప అనే రైతుకు చెందిన తోటలోని సుమారు 600 వక్క చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకున్నప్పటికీ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. భారీగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు హనుమంతప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టారు.