అల్లూరి జిల్లా గుండెలి పంచాయితీ పైడిపుట్టు గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడంతో స్థానిక గిరిజనులు మట్టి గోడ కట్టి రేకులు షెడ్యూలు నిర్మించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్థానిక గిరిజనులు వారు పడుతున్న కష్టాలను వీడియో తీసి పాడేరు మీడియాకు చేరవేశారు. గ్రామంలో పాఠశాల భవనం లేక 25 మంది వరకు ఉన్న విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఇద్దరు ఉపాధ్యాయులు వస్తున్నప్పటికీ ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో పాఠాలు నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో తామే మట్టి గోడలతో రేకుల షెడ్డు నిర్మించుకుందామని వెల్లడించారు.