భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలంలో సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ త్రి ప్రాజెక్టు కాంట్రాక్టు వోల్వో డ్రైవర్ గా పనిచేస్తున్న మాచర్ల రమేష్ ఇల్లు లేకపోవడంతో క్యాంప్లో నివసిస్తున్నాడు.ఈనేపథ్యంలో తన తల్లిని చూడడానికి శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా ఓపెన్ కాస్ట్ సమీపంలో ఆగి ఉన్న బొగ్గు లారీని వెనుక నుంచి ఢీకొనగా రమేష్ కు తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం కు తరలించినట్లు ఆదివారం ఉదయం ఏడు గంటలకు తెలిపారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉందని యాజమాన్యం ఆదుకోవాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.