నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం హెచ్.కొట్టాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఏకంగా ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, 26 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. వీటితో పాటు రూ.1.92 లక్షలకు పైగా నగదు అపహరించారని బాధితులు వాపోతున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.