జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండల కేంద్రంలో యూరియా అందించడం లేదంటూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గాండ్ర వెంకటరమణ రెడ్డి పాల్గొనగా ధర్నా చేస్తున్న ఆయన్ను బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు శాయంపేట పోలీసులు అదుపులకు తీసుకొని అరెస్టు చేశారు బలవంతంగా ఆయనను అక్కడి నుంచి తరలింప చేసి ధర్నాను విరమింప చేశారు.