ములుగు జిల్లా వ్యాప్తంగా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు నేడు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. అయితే జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తుండడంతో గణేష్ మండప నిర్వహకులు, కమిటీ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న గణేష్ ఉత్సవాలను సుందరంగా ముస్తాబు చేసేందుకు వర్షం అడ్డంకిగా మారడంతో కొంతవరకు గణేష్ ఉత్సవ నిర్వహణకు ఆలస్యం ఏర్పడింది. వర్షపు నీటిలో తడుస్తూ వినాయక విగ్రహాలను మండపాలకు తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు.