రైతులకు కొరత ఉన్న యూరియాను వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వైసీపీ నేతలు అన్నదాత పోరు కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్, వైసీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయరాజు, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావు, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హాజరయ్యారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్న కారణంగా ఎలాంటి ర్యాలీలు ధర్నాలు అనుమతులు లేవని తెలవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈమేరకు నాయకులు ఆర్డీవో కు వినతిపత్రం అందజేసారు..