అనంతపురం నగరంలోని సాయి నగర్ లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారి తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించగా వారి కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు.