జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు మంజూరు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. ఏలూరులోని కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం 6:00 బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 70 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించామని, 20 వేల 500 మంది కౌలు రైతులకు 375 కోట్ల రూపాయలు రుణాల లక్ష్యానికి గాను ఇంవరకు కేవలం 5772 మంది కౌలు రైతులకు 31. 69 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు.