తాడిపత్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం-1పై గురువారం తెల్లవారుజాము ఓ వృద్ధురాలు మృతి చెందింది. 50 ఏళ్ల వయసు ఉన్న లక్ష్మీదేవి అనే వృద్ధురాలికి ఫిట్స్ రావడంతో కిందపడి మృతి చెందింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన ఆమె భర్త శేషన్నతో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.