జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఏర్పడిన వరద నష్టాలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సోన్ మండలంలో పర్యటించారు. ఇటీవల వర్షాల కారణంగా ప్రభావితమైన ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్, ప్రజలు, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల వలన జరిగిన నష్టాలను అధికారులు ఇప్పటికే నష్ట నివారణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. పంట నష్టం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.