కాకినాడజిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో గల నాగరాజు పేట రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృత్యవాత పడినట్లు తుని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు బ్లాక్ జీన్ ధరించి ఉన్నాడని అదేవిధంగా కంటిలో పువ్వు ఉన్న మాదిరిగా ఉందన్నారు. అంతకుమించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు అన్నారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులు తెలిపారు