నంద్యాల జిల్లా మహానంది మండలంలోని ఆర్ఎస్ గాజులపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు నరసింహపై ఎలుగుబంటి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం చలమ రేంజ్ పరిధిలోని సున్నం బట్టి ఏరియాలోకి వెళ్లిన ఆ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించామన్నారు.