పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం కారుమంచి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిమజ్జనం సమయంలో భాగంగా విధ్వాన్సకాండ సృష్టించారని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కారుమంచి గ్రామంలో వైసీపీ నాయకుల ఇల్ల మీద పడి మరి తెలుగు దేశం పార్టీ నాయకులు విధ్వాన్సకాండా సృష్టించారని పేర్కొన్నారు. అలానే వైసిపి నాయకులకు సంబంధించి పోలీసులు విపరీతంగా కొట్టారని కూడా పేర్కొనడం జరిగింది. ఇది మంచిది కాదంటూ ఆయన విమర్శించారు.