అనంతపురం జిల్లా కేంద్రంలోని డిసిఎంఎస్ కార్యాలయం ఎదుట రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. రెండు మూటల యూరియాను అందించేందుకు అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో భోజనం కూడా చేయకుండా తెల్లవారులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.