రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ పై వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారాలు చేస్తుందని, దీనిని దిగజారుడు రాజకీయం అంటారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సోమవారం రాజమండ్రిలోని పదోవ డివిజన్ లో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించేలా ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు.