శోభాయాత్ర రెడీ.. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వినాయక నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాన చౌరస్తాలో వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జన కార్యక్రమానికి వెళుతున్న తీరుపై స్వాగతం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ నేతృత్వంలో సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. 8వ కాలనీ ఎన్టిపిసి రామగుండం పట్టణంలోని గణేష్ విగ్రహాలు గోదావరి నదిలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ స్వాగత సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుండి మొదలై రాత్రి వరకు జరగనున్న నిమజ్జన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ శ్రేణులు సేవలు అందిస్తున్నారు.