అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ ఎత్తున దివ్యాంగులు జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని తమకు తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కన్వీనర్ హరినాథ్ రెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున జిల్లాకు చేరుకున్న దివ్యాంగులు తమ నిరసనను వ్యక్తం చేశారు.