Parvathipuram, Parvathipuram Manyam | Aug 10, 2025
కడుపునొప్పి తాళలేక ఈనెల ఏడో తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మండంగి రేణుక (18) జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు. ఈనెల ఏడో తేదీన కొత్తాడలో ఉంటున్న కొండ తామర కృష్ణ ఇంటికి వెళ్ళింది. కడుపు నొప్పి రావడంతో తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.