ఏలూరు జిల్లా దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్గా కలపాల శ్రీహరి, సభ్యులుగా మరీదు మాణిక్యాలరావు, అవర్తల పద్మశాంతి, మిరపల సునీత ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం సాయంత్రం 4గంటలకు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు తరచూ ఆసుపత్రికి సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు.