పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలంలో చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్ పర్సన్ తోయక జగదీశ్వరి* నిర్వహించారు. హాస్పిటల్ లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరంతరం ఆసుపత్రిలో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ నాగభూషణరావు, జియమ్మవలస ఎంపిపి బొంగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.