గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఆదివారం అర్ధరాత్రికి వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కుల కు చేరే అవకాశం ఉందని గోదావరి హెడ్ వర్క్స్ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.